‘బాహుబలి కంటే అరణ్య షూటింగ్ కష్టంగా అనిపించింది’

‘బాహుబలి కంటే అరణ్య షూటింగ్ కష్టంగా అనిపించింది’

హైదరాబాద్: టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ దగ్గుబాటి రానా త్వరలో ఓ ఇంటి వాడు కానున్న సంగతి తెలిసిందే. డిజైనర్‌‌ మిహీకా బజాజ్‌తో మూడు ముళ్ల బంధానికి రెడీ అవుతున్న రానా.. తను యాక్ట్ చేసిన అరణ్య ఫిల్మ్‌ గురించి పలు విషయాలు పంచుకున్నాడు. బాహుబలిలో భల్లాలదేవగా నటించడం కంటే అరణ్య మూవీ చేసిన రోల్ కష్టంగా అనిపించదన్నాడు. అలాగే తన కెరీర్‌‌లో అరణ్య షూటింగ్ మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే చాలా కష్టంగా సాగిందన్నాడు.

‘అరణ్య షూటింగ్ టఫెస్ట్‌ అని చెప్పొచ్చు. ఈ ఫిల్మ్ షూటింగ్‌లో భాగంగా ఏనుగు మొండాన్ని నా భుజాలపై మోయాల్సి వచ్చింది. అది సుమారుగా 160–170 కేజీలు ఉంటుంది. ఇలాంటి సినిమాలు నాకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తున్నాయి’ అని రానా చెప్పాడు. తెలుగు, తమిళంతోపాటు హిందీలో రిలీజ్‌ కానున్న అరణ్యను ఏప్రిల్‌ మొదట్లో రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే కరోనా లాక్‌డౌన్‌తో రిలీజ్ వాయిదా పడింది. ఈ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌పై మేకర్స్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.