గోల్డెన్ గర్ల్‎కు అరుదైన గౌరవం.. ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా నీరూ ధండా

గోల్డెన్ గర్ల్‎కు అరుదైన గౌరవం.. ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా నీరూ ధండా

న్యూఢిల్లీ: భారత స్టార్ షూటర్ నీరూ ధండాకు అరుదైన గౌరవం దక్కింది. జపాన్ వేదికగా జరుగుతోన్న 2026 ఆసియా క్రీడల ముగింపు వేడుకలో భారత మహిళల పతాకధారిగా గోల్డ్ మెడలిస్ట్ నీరూ ధండా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధికారికంగా వెల్లడించింది. పురుషుల పతాకధారి ఎవరనేది త్వరలోనే ఖరారు చేయనున్నారు. కాగా, ఆసియా క్రీడల ఓపెనింగ్ సెర్మనీలో భారత స్టార్ షూటర్, ఒలింపిక్ పతక విజేత మనూ భాకర్, స్టార్ కబడ్డీ ప్లేయర్ పవన్ సెహ్రావత్ భారత క్రీడా బృందాన్ని ముందుండి నడిపించిన విషయం తెలిసిందే. 

జపాన్ వేదికగా జరుగుతోన్న 2026 ఆసియా క్రీడల్లో స్టార్ షూటర్ నీరూ ధండా చారిత్రాత్మక ప్రదర్శన చేసింది. అద్భుతమైన ప్రదర్శనతో రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం సాధించి దేశానికి మూడు మెడల్స్ అందించింది. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంతో పాటు ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో మనీషా రజత పతకాన్ని కూడా గెలుచుకున్నారు. 

అయితే, పోటీలు ముగిసిన తర్వాత కొన్ని కారణాల ఆమె గురువారమే ఇండియాకు తిరిగి వచ్చారు. ఆసియా క్రీడల క్లోజింగ్ సెర్మనీలో భారత ప్లాగ్ బేరర్‎గా ఎంపిక కావడంతో శనివారం (అక్టోబర్ 3) ఉదయం ఆమె తిరిగి జపాన్ వెళ్లనున్నారు. ఆదివారం (అక్టోబర్ 4) జరిగే ఆసియా క్రీడల ముగింపు వేడుకలో భారత మహిళల పతాకధారిగా త్రివర్ణ పతకాన్ని చేతబూని భారత బృందాన్ని ముందుండి నడిపించనున్నారు.