తమిళనాడులో 24 గంటలు షాపింగ్ మాల్స్ ఓపెన్

తమిళనాడులో 24 గంటలు షాపింగ్ మాల్స్ ఓపెన్

చెన్నై: ఇకపై తమిళనాడులో వారంలో 7 రోజులూ, 24 గంటలూ షాపింగ్ మాల్స్, పరిశ్రమలు పని చేయనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి గురువారం ఓ  గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో బిజినెస్ డెవలప్ మెంట్, వుమన్ సెక్యూరిటీ కోసం  ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కార్మిక శాఖ చేసిన ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించింది. మూడేళ్ల పాటు ఈ విధానం కొనసాగనుంది.

2016లో కేంద్ర ప్రభుత్వం దుకాణాలు మరియు విధుల నియంత్రణా మండలి, సేవలకు సంబంధించిన నిబంధనల చట్టాన్ని ప్రవేశపెట్టింది.  ఈ చట్ట ప్రకారం థియేటర్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, బ్యాంకులు సహ పలు పరిశ్రమలు వారంలో అన్నిరోజులూ పనిచేయొచ్చు. ఈ చట్టాన్ని ఆయా రాష్ట్రాలను తమకు  అనుగుణంగా కూడా మార్చుకోవచ్చని తెలిపింది. దీని ప్రకారం రాష్ట్రాలే తమ పరిధిలోని దుకాణాలు, సంస్థల పని గంటలను నిర్దేశించుకోవచ్చు.