ఇండెంట్ వేలల్లో ..ఇస్తోంది వందల్లో ..!

ఇండెంట్ వేలల్లో ..ఇస్తోంది వందల్లో ..!

కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలోకరోనా టెస్టింగ్ కిట్ల కొరత
టెస్టుల కోసం రోజుల తరబడి వెయిటింగ్
కరోనా వార్డుల్లో డాక్టర్లు, స్టాఫ్ కొరత

హైదరాబాద్, వెలుగు : కరోనా టెస్టుల కోసం ప్రభుత్వాస్పత్రులకు క్యూ కడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గంటల తరబడి క్యూలో ఉన్నా.. రేపు, మాపంటూ అధికారులు తిప్పుతున్నారు. కారణం టెస్టింగ్ కిట్ల కొరత. శేరిలింగంపల్లి సెగ్మెంట్ తోపాటు, చేవెళ్ల‌, సంగారెడ్డి, ఆచుట్టు పక్కల ప్రాంతాలవారు డైలీ 500 నుంచి వెయ్యి మంది అనుమానితులు టెస్టుల కోసం కొండాపూర్ జిల్లా ఆస్పత్రికి వస్తున్నారు. అందుకు తగ్గట్టు 2 వేల నుంచి 5 వేల టెస్టింగ్ కిట్లుకావాలని ఉన్నతాధికారులనుకోరితే 150
నుంచి 300లోపే పంపిస్తున్నారు. దాంతో వైద్య సిబ్బంది 50 – 150 వరకే టెస్టులు చేసి.. మిగతా వారిని మళ్లీ రమ్మంటున్నారు. దాంతో వాగ్వాదాలు జరుగుతున్నాయి. నాలుగైదు రోజులైనా టెస్ట్ చేయడంలేదని పలువురు వాపోతున్నారు. 2వేల టెస్టిం గ్ కిట్లు కోరితే, 300నుంచి 500 మధ్యే పంపిస్తున్నారని, అందుకే అందరికీ టెస్టులు చేయలేకపోతున్నామని ఇన్ చార్జ్ సూపరింటెండెంట్ రామకృష్ణ తెలిపారు.

సిబ్బంది లేక..

కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు హాస్పిటల్లో స్పెషల్ వార్డులు, 40 బెడ్లు ఏర్పాటు చేశారు. ఐసొలేషన్ వార్డులో ఫిజిషియన్స్ ఇద్దరు ఉండాలి. కానీ, ఒక్కరే ఉన్నారు. 8 మంది ఉండాల్సిన ఎంబీబీఎస్ డాక్ట‌ర్ల‌కు ఒక్కరూ లేరు. 16 మంది నర్సులకు నలుగురే ఉన్నారు. ఆరుగురు ల్యాబ్ టెక్నిషియన్లకు ఒక్కరు, హౌస్ కీపింగ్16 మందికి నలుగురు, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి ఇద్దరు ఉన్నారు. నోడల్ పర్సన్ అసలే లేరు. ఐసీయూలో 8మంది ఫిజిషియన్లకు గాను ఒక్కరు, 16 మంది స్టాఫ్ నర్సులకు నలుగురు, హౌస్ కీపింగ్ లో 16 మందికి నలుగురు, సెక్యూరిటీ సిబ్బంది 16 మందికి ఇద్దరు మాత్రమే ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి