ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.. వనపర్తిలో అరైవ్ అలైవ్ కార్యక్రమం

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.. వనపర్తిలో అరైవ్ అలైవ్ కార్యక్రమం

వనపర్తి, వెలుగు :  ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వనపర్తి కలెక్టర్​ ఆదర్శ్​ సురభి సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వనపర్తి మున్సిపాలిటీ,  పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన ఎస్పీ సునీతారెడ్డితో కలిసి మాట్లాడారు.  

స్పీడ్ లిమిట్ పాటించాలని, మద్యం సేవించి, ఫోన్​ మాట్లాడుతూ వాహనాలు నడపొద్దని చెప్పారు. పోలీసులు రోడ్డు పై తనిఖీలు  చేసేది వాహనదారుల ప్రాణాలు కాపాడటానికే తప్ప ఇబ్బందులకు గురి చేయడానికి కాదన్నారు. అనంతరం రోడ్డు భద్రత పై కళా ప్రదర్శన నిర్వహించిన తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులు,  పోలీస్ కళాకారులకు హెల్మెట్లు అందజేశారు.