హైదరాబాద్‌లో చిరుజల్లులు : చల్లబడిన నగరం

హైదరాబాద్‌లో చిరుజల్లులు : చల్లబడిన నగరం

హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, నారాయణగూడ, కూకట్ పల్లి , బోయినపల్లిలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి సూర్యప్రతాపంతో అల్లాడిన ప్రజలకు వర్షం ఉపశమనం కల్పించింది. మూడు రోజుల పాటు రాష్ట్రంతో పాటు హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.  ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీలోనూ వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంతో పాటు హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.