
‘బిగ్‌బాస్ సీజన్ 9’ సక్సెస్ ఫుల్గా ఫస్ట్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తిచేసుకుంది. ఆదివారం (సెప్టెంబర్ 14న) మొదటి ఎలిమినేషన్లో భాగంగా కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ బిగ్‌బాస్ ఇంటినుంచి బయటకి వెళ్లిపోయారు. ఈ మేరకు హోస్ట్ నాగార్జున, ఆమెను బయటకి పంపించే ముందు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగి చర్చల్లో నిలిచేలా చేశారు.
‘ఈ హౌజ్లో జెన్యూన్‌గా ఉన్న నలుగురు పేర్లు’ చెప్పమని నాగ్ అడగ్గా.. ‘రాము రాథోడ్, మనీశ్, హరీశ్, ఆషా షైనీ’ అని శ్రేష్టి తెలిపింది. కెమెరా ముందు నటించేవారు ఎవరనే ప్రశ్నకు.. ‘భరణి, రీతూ చౌదరి, తనూజ’ పేర్లు చెప్పింది. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అయితే, ఫస్ట్ ‘ఆషా షైనీ’ ఎలిమినేషన్ అవుతుందని అందరూ భావించారు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో శ్రేష్టి వర్మను ఇంటి నుంచి పంపించేశారు. ఈ క్రమంలో ఆమె అభిమానులు షాక్ అయినప్పటికీ.. మరికొందరు శ్రేష్టి వర్మకు తక్కువ ఓట్లు వస్తే ఎవ్వరేం చేస్తారని కామెంట్స్ పెడుతున్నారు. అయితే, శ్రేష్టి తన ఆటతీరుతో పెద్దగా ఎవ్వర్నీ ఆకట్టుకోలేకపోవడమే ఎలిమినేషన్కి కారణమని టాక్ వినిపిస్తుంది.
A bittersweet farewell… #ShrashtiVerma bids goodbye to the Bigg Boss house 👁️✨
— Starmaa (@StarMaa) September 14, 2025
Watch #BiggBossTelugu9 Mon–Fri at 9:30 PM, Sat & Sun at 9 PM on #StarMaa, and stream 24/7 on #JioHotstar pic.twitter.com/OGNuDlkdk8
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ సీజన్ 9 ఫస్ట్ వీక్లో (సెప్టెంబర్7-14) 9 మంది నామినేషన్లలో నిలిచారు. ఇందులో 8 మంది సెలబ్రిటీలు, ఓ కామనర్ ఉన్నారు. సెలబ్రిటీల్లో చూసుకుంటే.. కమెడియన్ సుమన్ శెట్టి, తనుజ, ఇమ్యాన్యుయెల్, సంజన గల్రానీ, రాము రాథోడ్, రీతూ చౌదరి, ఆషా షైనీ, శ్రేష్టి వర్మ నామినేట్ అయ్యారు. కామనర్లో డీమాన్ పవన్ ఈ లిస్ట్లో ఉన్నాడు. ఇక కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ బయటకి రావడంతో ఫస్ట్ వీక్ విజయవంతంగా కంప్లీట్ అయింది.
ఈ క్రమంలో.. శ్రేష్టి వర్మ ఈ వారం రోజులకు గానూ దాదాపుగా రూ. 2 లక్షల వరకు రెమ్యునరేషన్ కలెక్ట్ చేసినట్లు టాక్. అంటే, శ్రేష్టి వర్మ రోజుకు సుమారు రూ 28,571 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు బిగ్ బాస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే, మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే.. ఈ అమౌంట్ తక్కువే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రసెంట్ వీక్ మిగిలిన కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి పోటీ ఉండనుందో, వారి మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి నెలకొంది.