Shreyas Iyer: భారత జట్టు టీ20 సారథిగా తనని సెలక్ట్ చేసినందుకు శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యాడు. ముంబై టీ20 లీగ్ లో ముంబై ఫాల్కన్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అయ్యర్, మ్యాచ్ గెలిచిన తర్వాత మాట్లాడుతూ.. టీమిండియా జట్టు పగ్గాలు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఆటగాడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించడమే గొప్ప విషయం, అలాంటిది ఒక జాతీయ జట్టుకి నాయకత్వ బాధ్యతలు చేపట్టడం గొప్ప అనుభూతి అని శ్రేయస్ వెల్లడించాడు.
కెప్టెన్సీతో బాధ్యత పెరిగింది:
కెప్టెన్సీ పదవి నా గౌరవాన్ని , బాధ్యతని మరింత పెంచిందని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా నాకు సపోర్టు చేస్తూ, అండగా నిలిచిన అభిమానులని ప్రత్యేక ధన్యవాదాలు.. టీ20 సారథిగా ఇచ్చిన జోష్ తో ముంబై ఫాల్కన్స్ తరపున కీలక ఇన్సింగ్స్ ఆడాటమే కాకుండా జట్టుని గెలిపించడం సంతోషంగా ఉందన్నాడు. ఇక నా ప్రత్యర్థి జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వద్దకి వెళ్లి అప్యాయంగా పలకరించా.. అతడు నాకు కెప్టెన్సీ రావడంపై ఎంతో ఆనందం వ్యక్తం చేశాడని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు శ్రేయస్:
మ్యాచ్ విషయానికి వస్తే.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని ట్రంప్ నైట్స్ ఎంఎన్ఈ జట్టుపై శ్రేయస్ అయ్యర్ టీమ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సూర్యసేన 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 147 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బరిలోకి దిగిన శ్రేయస్ సైన్యం 16.4 ఓవర్లలోనే మ్యాచ్ ని ఖతం చేసేశారు. ఈ పోరులో అయ్యర్ 36 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సులతో 61 పరుగుల చేసి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు.
