శ్రేయస్ కామెంట్లతో ఇరుకున పడ్డ గంగూలీ

శ్రేయస్ కామెంట్లతో ఇరుకున పడ్డ గంగూలీ

దాదా తనకు హెల్ప్‌ చేస్తున్నాడన్న శ్రేయస్‌ అయ్యర్

కాన్‌ ఫ్లిక్ట్‌ కిందకు వస్తుందని విమర్శలు

ముంబై: ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌ చేసిన ఓ కామెంట్‌ .. బీసీసీఐ బాస్‌‌‌‌ సౌరవ్‌‌‌‌ గంగూలీని ఇరుకున పడేశాయి. పంజాబ్‌ తో టాస్ తర్వాత కామెంటేటర్‌ సైమన్‌ డౌల్‌‌‌‌తో మాట్లాడిన అయ్యర్‌ .. తనకు మార్గని ర్దేశనం చేసేందుకు పాంటింగ్‌, గంగూలీ దగ్గర ఉండటం అదృష్టమని అన్నాడు. ఈ సీజన్‌ లో తనతో పాటు టీమ్‌ కు కూడా దాదా హెల్ప్‌‌‌‌ చేస్తున్నాడని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు ఇతర ఫ్రాంచైజీలతో పాటు బీసీసీఐ అధికారులకు కూడా తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. బీసీసీఐ బాస్‌‌‌‌గా ఉన్న గంగూలీ.. ఐపీఎల్‌‌‌‌ టీమ్‌ కు మెంటార్‌గా ఉండటం కాన్‌ ఫ్లిక్ట్‌ కిందకు వస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. లాస్ట్‌ సీజన్‌ వరకూ దాదా ఢిల్లీకి మెంటర్‌గా వ్యవహరించాడు. కానీ బీసీసీఐ పగ్గాలు అందుకున్న తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

అయినా.. దాదా తమకు సాయం చేస్తున్నాడని చెప్పడం చాలా మందికి రుచించడం లేదు. గంగూలీపై ఇప్పటికే పలు కాన్‌ ఫ్లిక్ట్‌ ఆరోపణలు వచ్చా యి. ఇప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్‌ అయిఉండి కూడా ఓ ఫ్రాంచైజీతో అసోసియేట్‌ అయ్యాడని అనడం సరికాదని బోర్డు మెంబర్స్‌ చెబుతున్నారు. అయితే అయ్యర్‌ ను తప్పుపట్టాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు. ‘అయ్యర్‌ ఓ క్రికెటర్‌. అతను ఆట గురించే మాట్లాడతాడు. ఈ సీజన్‌ కు తాము ఎలా ప్రిపేర్‌ అవుతామనే దాని గురించి అతను చెప్పిన మాటల్లో తప్పేమీ లేదు. కాకపోతే ఇలాంటి విషయాల్లో బాధ్యత తీసుకోవాల్సింది ఆ ఫ్రాంచైజీ, బీసీసీఐనే. లేదంటే బోర్డు, ఐపీఎల్‌‌‌‌కే నష్టం’అని మరికొందరు పేర్కొన్నారు.