ముంబై: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దాదాపు మూడు నెలల విరామం తర్వాత మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెడుతూ విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. గత ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో గాయపడి సర్జరీ చేయించుకున్న అయ్యర్ కోలుకొని ఫిట్‌నెస్ సాధించాడు. అదే సమయంలో ముంబై రెగ్యులర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ గాయపడటం, శివం దూబే, సూర్యకుమార్ అందుబాటులో లేకపోవడంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ అయ్యర్‌కు కెప్టెన్సీ అప్పగించింది.
మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌తో, గురువారం పంజాబ్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో తను ముంబై జట్టును నడిపించనున్నాడు. ఈ రెండు మ్యాచ్‌లు అయ్యర్‌కు కీలకం కానున్నాయి. ఎందుకంటే ఈ నెల 11 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు తను వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. హజారే టోర్నీలో తన పూర్తి ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటేనే అయ్యర్ కివీస్‌పై బరిలోకి దిగుతాడు.
