
హీరోయిన్‌గా గ్లామరస్ రోల్స్‌తో ఆకట్టుకున్న శ్రియా శరణ్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌తో మెప్పిస్తోంది. ఈనెల 12న రాబోతున్న ‘మిరాయ్’ చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషించింది. మంగళవారం (సెప్టెంబర్ 03) తన పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఆమె పోషిస్తున్న అంబిక అనే పవర్‌ఫుల్ మదర్ క్యారెక్టర్.. స్ట్రాంగ్ ఎమోషన్‌తో ఉండబోతోందని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. తేజ సజ్జా హీరోగా కార్తిక్ ఘట్టమనేని రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
తేజ సజ్జ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. గౌర హరి సంగీతం అందిస్తున్నాడు.