
అందరి రికార్డ్‌లను కోహ్లీ బద్దలు కొట్టడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఇక్కడ కోహ్లీ రికార్డునే మరొకరు బద్దలుకొడితే? అవును కోహ్లీ 10 ఏళ్ల క్రితం నాటి రికార్డును మన యంగ్ ప్లేయర్ శభమన్ గిల్ బ్రేక్ చేశాడు.
రాంచీలో ఇండియా సి, ఇండియా బి జట్ల మధ్య దేవధర్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గిల్ కేవలం ఒక్క పరుగుకే అవుటయ్యాడు. అయినా ఈ మ్యాచ్‌తో గిల్ రికార్డ్ నెలకొల్పాడు. అలా ఎలా అనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి..
దేవధర్ ట్రోఫీలో 2009-10 సంవత్సరంలో టీం ఇండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ నార్త్ జోన్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అప్పుడు కోహ్లీ వయసు 21 సంవత్సరాల 142 రోజులు. ప్రస్తుతం 2019-20 దేవధర్ ట్రోఫీలో ఇండియా ‘సి’ కి కెప్టెన్‌గా శుభమన్ గిల్ వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు గిల్ వయసు 20 సంవత్సరాల 57 రోజులు. ఈ విధంగా అతి చిన్న వయసులో కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ రికార్డును 10 సంవత్సరాల తర్వాత గిల్ బద్దలు కొట్టాడు.
దేవధర్ ట్రోఫి ఫైనల్లో గిల్ కెప్టెన్‌గా నడిపిస్తున్న ఇండియా ‘బి’, ఇండియా ‘సి’ చేతిలో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఒక పక్క మ్యాచ్ ఓడిపోయినా, మరోపక్క క్లోహీ రికార్డ్‌ను బ్రేక్ చేశానన్న ఆనందం మాత్రం గిల్‌కు ఉండిపోయింది.