గిల్ సెంచరీ..సిక్సులు, ఫోర్లతో సునామీ

గిల్ సెంచరీ..సిక్సులు, ఫోర్లతో సునామీ

బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డేలో శుభ్ మన్ గిల్ సెంచరీతో కదం తొక్కాడు. సూపర్ ఫాంలో ఉన్న గిల్.. 117 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. 32వ వన్డే ఆడుతున్న శుభ్ మన్ గిల్‌కి ఇది ఐదో సెంచరీ. 
  
266 పరుగుల టార్గెట్ ఛేజింగ్ లో టీమిండియాకి సరైన శుభారంభం దక్కలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసిన  రోహిత్ శర్మ, కొత్త తంజీమ్‌ హసన్ షేక్ బౌలింగ్‌లో అనమోల్ హక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తెలుగుకుర్రాడు తిలక్ వర్మ  9 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన తిలక్ వర్మ, తంజీమ్ హసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో 17 పరుగులకే టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది.  ఈ దశలో గిల్, కెఎల్ రాహుల్ కలిసి మూడో వికెట్‌కి 57 పరుగులు జోడించారు. 39 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మహెదీ హసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 15 బంతుల్లో 5 పరుగులు చేసిన మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో LBWగా అవుట్ అయ్యాడు.

ఓ వైపు వికెట్లు పడుతున్న గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయాడు. సెంచరీ అయ్యాక కూడా గిల్ మరింతగా రెచ్చిపోయాడు. మెహదీ హసన్ బౌలింగ్ లో ఓ సిక్స్ కొట్టి  ఊపుమీదున్న గిల్..ఆ తర్వాత బంతిని సిక్స్ గా మలిచేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. 

ఈ సెంచరీతో 2023లో 1500 రన్స్ పూర్తి చేసుకున్నాడు. అలాగే ఈ ఏడాదిలో గిల్ కు ఇది ఐదో సెంచరీ. అంతేకాదు.. 2023లో వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు గిల్.