IND vs ENG 2025: రోహిత్ బాటలోనే గిల్.. టీమిండియా టెస్ట్ కెప్టెన్‌కు వింత సమస్య

IND vs ENG 2025: రోహిత్ బాటలోనే గిల్.. టీమిండియా టెస్ట్ కెప్టెన్‌కు వింత సమస్య

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ కు వింత సమస్య ఎదురవుతుంది. బ్యాటర్ గా అత్యత్తంగా ఆడుతున్నా.. కెప్టెన్సీలో అదరగొడుతున్నా ఒక విషయంలో మాత్రం గిల్ కు అదృష్టం కలిసి రావడం లేదు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో తొలిసారి టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్.. ఇప్పటివరకు టాస్ గెలవలేదు. తొలి మూడో టెస్టుల్లో ఈ టీమిండియా నయా సారధి టాస్ ఓడిపోవడం విశేషం. లీడ్స్, ఎడ్జ్ బాస్టన్ టెస్టుల్లో టాస్ ఓడిపోగా.. ప్రస్తుతం జరుగుతున్న లార్డ్స్ టెస్టులోనూ టాస్ ఓడిపోయాడు. దీంతో రోహిత్ బాటలోనే ఈ యువ సారధి టాస్ గెలవడంలో విఫలమవుతున్నాడు. 

తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచి ఈ సారి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ సిరీస్ లో మరో టెస్టుల్లో అయినా గిల్ టాస్ గెలిచి బోణీ కొడతాడేమో చూడాలి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై టీమిండియా టాస్ ఓడిపోయింది. దాంతో వరుసగా వన్డేల్లో 15 సార్లు టాస్ ఓడిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. బహుశా..! భవిష్యత్తులోనూ ఈ రికార్డు చెక్కుచెదరక పోవచ్చని విశ్లేషకుల మాట. కేవలం రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే టీమిండియా 12 సార్లు ఓడిపోవడం ఆశ్చర్యకరం. 

►ALSO READ | IND vs ENG 2025: ఇంగ్లాండ్ బ్యాటర్ల తడబాటు.. టీమిండియాదే తొలి సెషన్

భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడం ఇది 10వ సారి. దాంతో, వరుసగా అత్యధిక టాస్‌లు ఓడిన కెప్టెన్ల జాబితాలో హిట్ లారా (12) తో పాటు అగ్రస్థానంలో ఉన్నాడు. లో నిలిచారు. పీటర్ బోరెన్ (11సార్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ తో తొలిసారి గిల్ టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టుల్లో టీమిండియా ఓడిపోయినా ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన రెండో టెస్టులో ఘన విజయాన్ని అందుకుంది.