IND vs ENG 2025: నాలుగో టెస్టులో పంత్, బుమ్రా ఆడతారా.. గిల్ ఏమన్నాడంటే..?

IND vs ENG 2025: నాలుగో టెస్టులో పంత్, బుమ్రా ఆడతారా.. గిల్ ఏమన్నాడంటే..?

ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా పోరాడి ఓడిపోయింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ టెస్టులో టీమిండియా అనూహ్య పరాజయాన్ని చవి చూసింది. ఆల్‌‌‌‌రౌండర్ రవీంద్ర జడేజా (181 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 61 నాటౌట్‌‌‌‌) అత్యద్భుత పోరాటంతో ఇంగ్లండ్ బౌలర్లకు ఎదురు నిలిచినా.. మిగతా బ్యాటర్లు నిరాశ పరచడంతో మూడో టెస్టులో ఇండియా 22 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఆఖరి మూడు వికెట్లకు వరుసగా 30, 35, 23 భాగస్వామ్యాలతో ఆశలు రేపినా చివరకు ఇండియా 74.5 ఓవర్లకు 170 రన్స్‌‌‌‌కు ఆలౌటై విజయాన్ని చేజార్చుకుంది.  

Also Read:-15 బంతుల్లో 5 వికెట్లు.. 100వ టెస్టులో స్టార్క్ వరల్డ్ రికార్డ్

ఈ విజయంతో ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో ఇంగ్లాండ్ 2–1తో ఆధిక్యం సాధించింది. స్టోక్స్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి మాంచెస్టర్‌‌‌‌‌‌‌‌లో జరుగుతుంది. నాలుగో టెస్టు టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్ కు స్టార్ ప్లేయర్లు పంత్, బుమ్రా అందుబాటులో ఉంటారా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. లార్డ్స్ టెస్టులో రిషబ్ పంత్ చేతి వేలికి గాయమైంది. మరోవైపు బుమ్రా చివరి టెస్టుల్లో ఒకటే టెస్ట్ ఆడనున్నాడు. దీంతో వీరిద్దరూ నాలుగో టెస్ట్ ఆడతారా లేదా అనే విషయంపై గిల్ స్పందించాడు. మ్యాచ్ తర్వాత వీరిద్దరిపై కీలక సమాచారం అందించాడు. 

SHUBMAN GILL ON BUMRAH PLAYING THE 4TH TEST. 🗣️

"You'll get to know about it soon". pic.twitter.com/GmZPETV9tA

— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2025

గిల్ మాట్లాడుతూ.. "రిషబ్ స్కానింగ్ కు వెళ్ళాడు. అతనికి పెద్దగా గాయం కాలేదు. జూలై 23న మాంచెస్టర్‌లో ప్రారంభమయ్యే నాల్గవ టెస్ట్‌కు అతను బాగానే ఉంటాడని భావిస్తున్నాం". అని గిల్ అన్నాడు. నాలుగో టెస్టుకు బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అని అడిగినప్పుడు "త్వరలోనే మీరు అతని గురించి తెలుసుకుంటారు". అని టీమిండియా కెప్టెన్ సమాధానమిచ్చాడు. గిల్ మాటలను బట్టి చూస్తే నాలుగో టెస్టులో పంత్ ఆడడం ఖాయంగా మారింది. బుమ్రా విషయంలో జట్టు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

లార్డ్స్ లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. రూట్ (100) సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు, బుమ్రా 5 వికెట్లతో రాణించాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో ఇండియా కూడా సరిగ్గా 387 పరుగులు చేసింది. రాహుల్ సెంచరీ చేసి ఇండియాను ఆదుకున్నాడు. భారత బౌలర్లు విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 192 పరుగులకే ఆలౌట్ అయింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయింది.