నెట్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌లో గిల్‌‌‌‌..అహ్మదాబాద్‌‌‌‌ చేరుకున్న టీమిండియా

నెట్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌లో గిల్‌‌‌‌..అహ్మదాబాద్‌‌‌‌ చేరుకున్న టీమిండియా

అహ్మదాబాద్‌‌‌‌ : డెంగీ కారణంగా తొలి రెండు మ్యాచ్‌‌‌‌లకు దూరమైన టీమిండియా ఓపెనర్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ పూర్తిగా కోలుకున్నాడు. బుధవారమే అహ్మదాబాద్‌‌‌‌ వచ్చిన గిల్‌‌‌‌ గురువారం నరేంద్ర మోదీ స్టేడియంలో నెట్స్‌‌‌‌లో గంట పాటు  ప్రాక్టీస్‌‌‌‌ చేశాడు. ఈ స్పెషల్‌‌‌‌ నెట్‌‌‌‌ సెషన్‌‌‌‌ కోసం టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌  లెఫ్టార్ట్‌‌‌‌ త్రోడౌన్‌‌‌‌ స్పెషలిస్ట్‌‌‌‌ నువాన్‌‌‌‌ను అతనితో పాటు అహ్మదాబాద్​కు పంపింది. ఉదయం 11 గంటల సమయంలో స్టేడియంలోకి వచ్చిన గిల్‌‌‌‌ ముందుగా  టీమ్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌ పర్యవేక్షణలో మెయిన్‌‌‌‌ స్టేడియంలో ఎక్సర్‌‌‌‌సైజెస్‌‌‌‌, రన్నింగ్‌‌‌‌ చేసి తర్వాత  నెట్స్‌‌‌‌లోకి వెళ్లాడు.

పాక్‌‌‌‌ లెఫ్టార్మ్‌‌‌‌ పేసర్‌‌‌‌ షాహీన్‌‌‌‌ ఆఫ్రిదిని దృష్టిలో ఉంచుకొని నువాన్‌‌‌‌ 150 కి.మీ స్పీడుతో విసిరిన త్రోడౌన్స్‌‌‌‌ను ఎదుర్కొంటూ కనిపించాడు. తర్వాత నెట్‌‌‌‌ బౌలర్లను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కొన్నాడు. దాంతో శనివారం పాకిస్తాన్‌‌‌‌తో జరిగే మెగా మ్యాచ్‌‌‌‌కు అతను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గురువారం ఢిల్లీ నుంచి వచ్చిన రోహిత్‌‌‌‌ సేన శుక్రవారం ప్రాక్టీస్‌‌‌‌ సెషన్‌‌‌‌లో పాల్గొననుంది. ఈ సెషన్‌‌‌‌ తర్వాత మెడికల్‌‌‌‌ టీమ్‌‌‌‌ను సంప్రదించి గిల్‌‌‌‌ తుది జట్టులో ఉండే విషయంపై కోచ్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌ తుది నిర్ణయం తీసుకునే చాన్సుంది.