
IPL లో సత్తాచాటిన యంగ్ క్రికెటర్ శుభ్‌మన్‌గిల్ అదో జోరును కొనసాగిస్తున్నాడు. విండీస్ –Aతో జరుగుతున్న అనధికార మూడో టెస్టులో ఇండియా- A బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్‌గిల్ డబుల్ సెంచరీతో అరుదైన ఘనత సాధించాడు. (204; 250బాల్స్ లో 19×4, 2×6) రన్స్ చేసిన గిల్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో గౌతమ్ గంభీర్ రికార్డును బద్దలు కొట్టాడు. 2002లో 20 ఏళ్ల వయసున్న గంభీర్ జింబాబ్వేతో తలపడిన మ్యాచ్ లో 218 రన్స్ చేయగా శుభ్‌మన్‌గిల్ 19 ఏళ్ల వయసులోనే డబుల్ సెంచరీ బాది.. ఈ ఘనత సాధించిన అత్యంత చిన్న వయస్కుడైన భారత క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్ లో గిల్ డబుల్ సెంచరీ చేయగానే కెప్టెన్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేయడంతో విండీస్ ముందు 373 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా ఎ 201 పరుగులకు ఆలౌటవ్వగా విండీస్ 194 పరుగులు చేసింది. దీంతో ఇండియా జట్టుకు రెండో ఇన్నింగ్స్‌లో ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 15 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి వికెట్లేమీ నష్టపోకుండా 37 రన్స్ చేసింది.
విండీస్ టూర్ కు వెళ్లే టీమ్ ఇండియాలో చోటు దక్కుతుందని ఆశించానని, అయితే అది జరగకపోవడంతో నిరాశకు గురైనట్లు తెలిపాడు శుభమ్ గిల్. వెస్టిండీస్-A టీమ్ తో జరిగిన ఐదు వన్డేల అనధికారిక సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు శుభ్‌మన్‌గిల్.
Shubman Gill makes his mark in the West Indies, will his A form translate to India success in the near future? https://t.co/hhNkVrxinO pic.twitter.com/l4CJkzNPyJ
— ESPNcricinfo (@ESPNcricinfo) August 9, 2019