తన క్రష్ పేరును బయటపెట్టిన శుభ్మన్ గిల్

తన క్రష్ పేరును బయటపెట్టిన శుభ్మన్ గిల్

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ తనపై వస్తున్న రూమర్స్ కు కొంత క్లారిటీ ఇచ్చాడు. తన గర్ల్ ఫ్రెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండుల్కరా లేక బాలీవుడ్ బ్యాటీ సారా అలీ ఖాన్ అన్న దానిపై చాలా కాలంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆ రూమర్స్ కు తగ్గట్లే శుభ్ మన్ వాళ్లిద్దరితో  డేటింగ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా గిల్ వీటన్నింటికీ క్లారిటీ ఇచ్చాడు. 

తన క్రష్ ఎవరో చెప్పేసాడు. తనకిష్టమైన సెలబ్రిటీ గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. సోషల్ మీడియాలో ఓ ఫాలోవర్ సెలబ్రిటీ క్రష్ గురించి అడగ్గా దానికి సమాధానంగా గిల్.. టాలీవుడ్ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మికా మందన్న పేరు చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ పేరు చెప్తారని భావించిన నెటిజన్లకు గిల్ షాక్ ఇవ్వడంతో ఈ విషయం సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.