IND vs ENG 2025: బాగుందిరా మామ.. ఊరమాస్ తెలుగుతో నితీష్‌ను ఎంకరేజ్ చేసిన గిల్

IND vs ENG 2025: బాగుందిరా మామ.. ఊరమాస్ తెలుగుతో నితీష్‌ను ఎంకరేజ్ చేసిన గిల్

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ తనదైన కెప్టెన్సీతో అదరగొడుతున్నాడు. నిర్ణయాలు నుంచి ఆటగాళ్లను ఎంకరేజ్ చేయడం వరకు ఈ కొత్త సారధి మంచి మార్కులే కొట్టేస్తున్నాడు. గురువారం (జూలై 10) ఇంగ్లాండ్ తో ప్రారంభమైన లార్డ్స్ టెస్టులో గిల్ తెలుగులో మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి బౌలింగ్ చేస్తున్నప్పుడు బాగుందిరా మామ అంటూ తెలుగులో మాట్లాడి ఎంకరేజ్ చేయడం విశేషం. గిల్ ఇలా తెలుగులో మాట్లాడడం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. 

రూట్ కు నితీష్ తన రెండో ఓవర్లో ఎక్స్ ట్రా బౌన్సర్ విసిరాడు. పిచ్ పై పడి అనూహ్యంగా బౌన్స్ అయిన ఈ బంతి ఔట్ స్వింగ్ తిరుగుతూ దూరం వెళ్ళింది. ఈ సమయంలో గిల్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తూ తెలుగులో బాగుందిరా మామ అంటూ సపోర్ట్ ఇచ్చాడు. అప్పటికే రెండు వికెట్లు తీసి ఊపు మీదున్న నితీష్ మ్యాచ్ లో తన స్వింగ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియాకు నితీష్ బ్రేక్ ఇచ్చాడు. 13 ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్ (23) ను ఔట్ చేసి భారత జట్టుకు తొలి వికెట్ అందించాడు. ఇదే ఓవర్ చివరి బంతికి మరో ఓపెనర్ క్రాలీ (18) ని సూపర్ డెలివరీతో ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి తొలి సెషన్ లో కాస్త వెనకపడింది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు టీ విరామ సమయానికి 2 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. క్రీజ్ లో రూట్ (54), పోప్ (44) ఉన్నారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీసుకున్నాడు. 

►ALSO READ | IND vs ENG 2025: అడ్డుకున్న రూట్, పోప్.. వికెట్ కోసం శ్రమిస్తున్న టీమిండియా