Shubman Gill : ఐసీసీ అవార్డు దక్కించుకున్న శుభ్ మన్ గిల్

Shubman Gill : ఐసీసీ అవార్డు దక్కించుకున్న  శుభ్ మన్ గిల్

టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. జనవరి నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్లో అద్భుతంగా రాణించడంతో గిల్ను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వరించింది.  ఈ అవార్డు కోసం టీమిండియా నుంచి సిరాజ్, కివీస్‌ బ్యాట్స్ మన్ డెవాన్‌ కాన్వే, గిల్ పోటీపడగా...చివరకు ఐసీసీ ను ఎంపిక చేసింది. 

సెంచరీల మోత...

టీ20, వన్డే, టెస్టులు..ఫార్మాట్ ఏదైనా..శుభ్ మన్ గిల్ పరుగుల వరద పారిస్తున్నాడు. జనవరిలో టీ20, వన్డేల్లో సెంచరీల మోత మొగించాడు.  శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌లలో శతకాలు కొట్టాడు. జనవరిలో ఏకంగా అతను మూడు సెంచరీలు సాధించడం విశేషం. మొత్తంగా ఒక్క జనవరిలోనే 567 పరుగులు చేశాడు. ఇందులో న్యూజిలాండ్‌పై హైదరాబాద్ లో  చేసిన డబుల్ సెంచరీ హైలెట్. 149 బంతుల్లో 28 బౌండరీల సహాయంతో 208 పరుగులు సాధించాడు. దీంతో వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా గిల్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు.  అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన జరిగిన చివరి టీ20లోనూ  గిల్‌ చెలరేగాడు. కేవలం 63 బంతుల్లో 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా సచిన్‌ , రోహిత్ శర్మ, రైనా,  కోహ్లి తర్వాత మూడు  ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఐదో ఇండియన్ క్రికెటర్గా గిల్  రికార్డు సృష్టించాడు.

మరోవైపు జనవరి నెలకు గాను మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇంగ్లండ్ యంగ్‌ క్రికెటర్‌ గ్రేస్ స్క్రీవెన్స్  గెలుచుకుంది. ఆమె అండర్‌-19 వరల్డ్ కప్ లో గ్రేస్  పరుగుల వరద పారించింది. ఈ  అవార్డు  గెలుచుకున్న అత్యంత పిన్న వయసు క్రికెటర్‌గా గా స్క్రీవెన్స్ చరిత్ర సృష్టించింది.