ఓల్డ్ సిటీ/బషీర్‌బాగ్, వెలుగు: శ్యామ్ బాబా రథయాత్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం చార్మినార్ నుంచి ప్రారంభమైన శోభయాత్ర కాచిగూడ వీరన్నగుట్టలోని శ్యామ్‌బాబా మందిరం వరకు సాగింది. గుల్థార్ హౌస్, ఘన్నీ బజార్, హైకోర్టు, కూలీ కుతుబ్ షా స్టేడియం, పురానాపూల్, బేగంబజార్, గోషామహల్, కిషన్‌బాగ్, ఎంజీబీఎస్, ఛాదర్‌ఘాట్ మీదుగా యాత్ర కొనసాగింది. భక్తులు రంగురంగుల పతాకాలతో ఉత్సాహంగా పాల్గొనగా గాయకుడు కన్నయ్య మిత్తల్ భజన కీర్తనలు అలరించాయి.
ఇదే సమయంలో హైదరాబాద్ బెంగాలీ సమితి, హరే కృష్ణ నామ సంకీర్తన సొసైటీ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి ఊరేగింపు చార్మినార్ నుంచి కూలీ కుతుబ్ షా స్టేడియం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్యామ్‌బాబా రథయాత్ర కమిటీ చైర్మన్ ఇంద్రకరణ్, వైస్ చైర్మన్ రామ్‌దేవ్ అగర్వాల్, బెంగాలీ సమితి అధ్యక్షుడు బకరాన్ మాలిక్, ప్రధాన కార్యదర్శి శంకర్ గోష్, కోశాధికారి హనుమంతు మాలిక్ పాల్గొన్నారు.
