
సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై లోకేశ్ తీవ్రంగా గాయపడ్డారు. నాగారం, ఫణిగిరి మధ్య ఈ ప్రమాదం జరిగింది. గుమ్మడవెల్లలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో భాగంగా… అక్కడకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం పల్టీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం లోకేశ్ ను హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు.