శిరో ముండనం కేసులో ఎస్ఐని రిమాండుకు పంపాం: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

శిరో ముండనం కేసులో ఎస్ఐని రిమాండుకు పంపాం: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

ఒక ఎస్.ఐని ఇంత వేగంగా అరెస్టు చేయడం 34 ఏళ్ల సర్వీసులో ఇదే తొలిసారి –గౌతమ్ సవాంగ్

 విజయవాడ: రాజమండ్రి సీతానగరంలో దళితుడిని బహిరంగంగా శిరోముండనం చేసిన వ్యవహారంలో ఎస్.ఐని రిమాండ్ కు పంపామని… నా 34 ఏళ్ల సర్వీసులో ఒక పోలీసు అధికారి అయిన ఎస్.ఐని ఇంత వేంగంగా అరెస్టు చేసింది తొలిసారిగా చూశానని  ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్  అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల రిహార్సల్ ను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టెక్క్నాలజీ, ఇన్నోవేషన్ ఐడియాలు తదితర అంశాల్లో ఏపీకి జాతీయ స్ధాయిలో 26 అవార్డులు రావడం అత్యంత సంతోషకరం అన్నారు. టెక్నాలజీ వినియోగం, చాలా అభివృద్ధి, మార్పుల ఆధారంగా జాతీయ స్థాయిలో 26 అవార్డులు వచ్చాయన్నారు.

                      తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సీతానగరం లో శిరోముండనం విషయం నా దృష్టికి వచ్చిన తక్షణమే  కేసు నమోదు చేయమని ఆదేశించాము.. బాధ్యు డైన ఎస్సైని అరెస్టు చేసి రిమాండ్ కు పంపాం..ఇంకా విచారణ కొనసాగుతుంది… దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

               అలాగే  ప్రకాశం జిల్లా చీరాల ఘటనలో ఎస్.ఐ  పై చాలా వేగంగా చర్యలు తీసుకున్నాం.. ఇలాంటి ఘటనల్లో ఎవరిని ఉపేక్షించేది లేదు.. చీరాల సంఘటనలో పోలీస్ అధికారి పైనే చర్యలు తీసుకున్నాం, గతంలో ఏ ప్రభుత్వ హయాంలో వేగవంతంగా ఇలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

                    విజయవాడ కోవిడ్ ఆస్పత్రి స్వర్ణప్యాలెస్ లో అగ్ని ప్రమాదం ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని.. ప్రాధమిక దర్యాప్తులో ముగ్గురిని వెంటనే అరెస్టు చేశామని.. కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయిస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరించారు.