
హైదరాబాద్, వెలుగు: కేవైసీ సర్వీస్‌లు అందించే జొకాట సిడ్బీతో కలిసి ఎంఎస్‌ఎంఈ ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ ‘సంపూర్ణ్’ ను లాంచ్ చేసింది. ఎంఎస్‌ఎంఈ సెక్టార్ గ్రోత్‌ను కొలిచే ఇలాంటి ఇండికేటర్ రావడం ఇదే మొదటిసారి అని వెల్లడించింది.
‘ప్రస్తుతం మాక్రో ఎకనామిక్ ఇండికేటర్లు బిజినెస్ అంచనాలు, సర్వే బేస్డ్ ఒపీనియన్స్ డేటాపై ఆధారపడుతున్నాయి. ఎంఎస్‌ఎంఈల సేల్స్‌పై పూర్తి అవగాహనను సంపూర్ణ్ కలిపిస్తుంది’ అని తెలిపింది. జీఎస్‌టీ రిటర్న్స్‌లోని కంపెనీల మంత్లీ సేల్స్ డేటాను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.