Takkar Review : సిద్దార్థ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడా? లేక ఇది కూడా పోయినట్టేనా?

Takkar Review : సిద్దార్థ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడా? లేక ఇది కూడా పోయినట్టేనా?

హీరో సిద్ధార్థ్(Siddharth) చాలా గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ టక్కర్(Takkar). దివ్యంశా కౌశిక్(Divyansha Kaushik) హీరోయిన్ నటించిన టక్కర్ మూవీ జూన్ 9 శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. విడుదలకు ముందు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ కు ఆడియన్స్ నుండి మంచి రేపాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించింది.

ఇక ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు కంప్లీట్ కాగా, ఓవర్సీస్ లో కూడా షోలు పడ్డాయి. ఇక సినిమా చుసిన ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మరి టక్కర్ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈ సినిమా ఆడియన్స్ ఏమేరకు మెప్పించి అనేది ఈ రివ్యూలో తెసులుకుందాం. 

టక్కర్ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్సుడ్ రివ్యూస్ వస్తున్నాయి. కొంతమంది పర్లేదు సినిమా బాగానే ఉంది అంటుంటే.. మరికొందరు రొటీన్ స్టోరీ, బోరింగ్ స్క్రీన్ ప్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో.. సినిమాలో సిద్ధార్థ్ నటన చాలా బాగుందని, యోగిబాబు కామెడీ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయ్యిందని చెపుతున్నారు.

ఇక మొత్తంగా టక్కర్ సినిమా ఒక రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని, కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదని, సిద్దార్థ్ స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు మరోసారి డిజప్పాయింట్మెంట్ ఎదురైందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.