ఓపీ కోసం నేలపై కూర్చొని గర్భిణుల నిరీక్షణ..సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో ఘటన

ఓపీ కోసం నేలపై కూర్చొని గర్భిణుల నిరీక్షణ..సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో ఘటన

సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో ఓపీ వద్ద గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నెలవారీ పరీక్షల కోసం భారీ సంఖ్యలో వచ్చిన గర్భిణులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో, సిబ్బంది నేలపైనే కూర్చోబెట్టారు. నెలలు నిండిన మహిళలు సైతం గంటల తరబడి కింద కూర్చోవాల్సి రావడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి.