తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో అన్ని వసతులు: కలెక్టర్ హైమావతి

 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో అన్ని వసతులు: కలెక్టర్ హైమావతి

ములుగు, వెలుగు: తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సిద్దిపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైమావతి తెలిపారు. సోమవారం మర్కుక్ మండల కేంద్రంలో కొత్తగా మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం డీఈవో వరగంటి శాస్త్రితో కలిసి క్లాస్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రీ -ప్రైమరీలో 100 మంది, ఒకటి నుంచి 8వ తరగతి వరకు 320 మంది కలిపి మొత్తం 420 మంది విద్యార్థులతో క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థుల రాకపోకలకు ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల ద్వారా 4 బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో చంద్రకళ, అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విదేశీ దంపతులకు దత్తత

సిద్దిపేట టౌన్/రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రూల్స్ ప్రకారం దత్తత తీసుకోవాలని కలెక్టర్ కె.హైమావతి అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో విదేశీ దంపతులకు 18 నెలల పాపను దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దత్తత తీసుకునేందుకు సిద్దిపేటలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగం  ద్వారా అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీంతోపాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన దంపతులకు ఐదు నెలల బాబును, మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మల్కాజిగిరి జిల్లాకు చెందిన వారికి తొమ్మిది నెలల పాపను దత్తత ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి వివిధ సమస్యలపై 150 అర్జీలను స్వీకరించారు.