
హుస్నాబాద్, వెలుగు : ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు జిల్లాలోని పోలింగ్ స్టేషన్ల సమాచారం పక్కాగా ఉండాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై హుస్నాబాద్ ఆర్డీవో ఆఫీసులో రెవెన్యూ అధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. తహసీల్దార్లు, ఏఈఆర్వోలు, బీఎల్వోలతో సమావేశాలు నిర్వహించాలని ఆర్డీవోను ఆదేశించారు. జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో చెక్ చేయాలన్నారు.
ఆన్ లైన్ ద్వారా ఫారం 6, 7, 8 కింద వచ్చిన దరఖాస్తులకు సంబంధించి వచ్చేనెలా 27 నాటికి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలో ఈవీఎం, వీవీప్యాట్ వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు ఆయన ఓటరు అవగాహన శిబిరాన్ని పరిశీలించారు. సమావేశంలో ఆర్డీవో బెన్ శాలోమ్, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.