సిద్దిపేట రూరల్, వెలుగు: పని ప్రదేశాల్లో మహిళా సిబ్బందిపై వేధింపులను ఏమాత్రం సహించబోమని, ఫిర్యాదు వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ హాల్‌లో జెండర్ సెన్సిటైజేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే మహిళా ఫిర్యాదుదారులతో సానుభూతి, గౌరవంతో వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు.

