
సిద్దిపేట రూరల్, వెలుగు: ఈ నెల 8న పోలీస్ వెహికల్స్ విడిభాగాలను వేలం వేయనున్నట్లు సీపీ. డాక్టర్ బి. అనురాధ తెలిపారు. పెద్ద కోడూరు గ్రామ శివారులోని సీఎఆర్ హెడ్ క్వార్టర్ లో వేలం జరుగుతుందని, పోలీస్ వాహనాలకు వాడిన టైర్లు, బ్యాటరీలు, ఇతర వాడిన విడిభాగాలు వేలం వేస్తామన్నారు. వేలంకు కమిటీ చైర్మన్ గా ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాశ్ చంద్రబోస్, మెంబర్లుగా ఏసీపీ రవీందర్ రెడ్డి, రూరల్ సీఐ శ్రీను లను నియమించినట్లు సీపీ తెలిపారు.
వేలంపాటలో పాల్గొనే వారు 8వ తేదీన ఉదయం 9 గంటలకు వేలం పాట జరిగే ప్రదేశానికి వచ్చి పేర్లు నమోదు చేసుకొని పాల్గొనాలన్నారు. మరిన్ని వివరాల ప్రకారం ఏఆర్ఎస్ఐ వెంకటేశం 94405 04908, ఏఆర్ కానిస్టేబుల్ విజయ్ 95509 36373, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ధరణి కుమార్ 87126 67415 లను సంప్రదించాలని కోరారు.