బ్రిడ్జీ బడవో.. శంషాబాద్ బచావో.. గ్రామస్తుల ఆందోళన

బ్రిడ్జీ బడవో.. శంషాబాద్ బచావో.. గ్రామస్తుల ఆందోళన

‘బ్రిడ్జీ బడావో శంషాబాద్ బచావో’ అనే నినాదంతో సిద్ధాంతి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 44వ జాతీయ రహదారిపై శంషాబాద్ ప్యారడైజ్ హోటల్ నుంచి సింప్లెక్స్ వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జీని నిర్మిస్తున్నారు. అయితే ఈ ఫ్లైఓవర్ ర్యాంప్ ను రద్దీగా ఉండే సిద్ధాంతి మార్కెట్ కే నిర్మిచాలని నిర్ణయించారు. అయితే.. దీని వల్ల గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని గ్రామస్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. 

బ్రిడ్జీ ర్యాంప్ ను మల్లికా కన్వెన్షన్ వరకు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఇవాళ్టి నుంచి నిరసన దీక్ష చేపట్టారు. ఈ మేరకు గ్రామంలో పార్టీలకతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో బ్రిడ్జీ బడావ్ శంషాబాద్ బచావో అనే నినాదంతో దీక్షకు దిగారు. దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసుల మోహరించారు.