ఈ నెల 27న థియేటర్లలోకి ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. రిలీజ్ డేట్ ఖరారు

ఈ నెల 27న థియేటర్లలోకి ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. రిలీజ్ డేట్ ఖరారు

మనోజ్ కుమార్ ,  మోహన సిద్ధి,  శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా, రమేష్ చెరుకూరు దర్శకత్వంలో  సి సావిత్రమ్మ  నిర్మించిన చిత్రం ‘సిద్ధుగాడి లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోరీ’.  ఈనెల 27న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  తెలుగు సినిమాపై ఉన్న మక్కువతో అమెరికాలో ఉద్యోగం చేస్తూనే దర్శకుడిగా తన కలను నిజం చేసుకుంటున్నానని దర్శకుడు  రమేష్ బాబు చెప్పాడు.

ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రేమకథతో పాటు మంచి సందేశాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం అని తెలియజేశాడు.  సుమన్, సర్కార్, చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే  విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి స్పందన వచ్చింది.