హిట్ క్రెడిట్ అందరికీ.. మూవీ పోతే బ్లేమ్ నా ఒక్కడికే: సిద్ధు జొన్నలగడ్డ

హిట్ క్రెడిట్ అందరికీ.. మూవీ పోతే బ్లేమ్ నా ఒక్కడికే: సిద్ధు జొన్నలగడ్డ

‘‘నిర్మాతలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే సినిమా మేకింగ్‌‌లో ఇన్వాల్వ్‌‌ అవుతున్నాను” అని చెప్పారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. నీరజ కోన దర్శకత్వంలో తను నటించిన చిత్రం ‘తెలుసు కదా’. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్.  టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈనెల 17న సినిమా విడుదల సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ ఇలా ముచ్చటించారు. 

ఇందులో నేను పోషించిన వరుణ్​క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌‌గా ఉండబోతుంది. అలాగే మంచి హ్యూమర్ కూడా ఉంటుంది. తను మామూలుగా ఉన్నప్పటికీ తన ఆలోచనలు రాడికల్‌‌గా ఉంటాయి. ఈ క్యారెక్టర్ ఒక ఎడ్జ్ మీద ఉంటుంది. నా పాత్ర ప్రేక్షకులకు కచ్చితంగా ఒక కొత్త ఎక్స్‌‌పీరియన్స్‌‌ను ఇస్తుందనే నమ్మకం ఉంది. 
    
లవ్‌‌ స్టోరీ అయినప్పటికీ ఇందులో ఎనభై శాతం కొత్త సీన్స్‌‌ ఉంటాయి. గతంలో చూసిన సీన్స్‌‌లా అనిపించవు. లవ్‌‌స్టోరీతో పాటు లవ్‌‌ మ్యారేజ్‌‌, ఫ్యామిలీ రిలేషన్‌‌షిప్‌‌ గురించిన చర్చ ఉంటుంది. కానీ ప్రతీ సీన్‌‌ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాను ఏ జానర్ అనేది చెప్పలేం. ఇదొక ఒరిజినల్ ఫిల్మ్. లవ్, లైఫ్ గురించి డైలాగ్స్ చాలా హార్డ్ హిట్టింగ్‌‌గా వుంటాయి
    
నీరజ చెప్పిన కథలో ఒక యూనిక్ నెస్ ఉంది. దానికి తగ్గట్టు క్యారెక్టరైజేషన్స్‌‌ డెవలప్ అయితేనే చేద్దామని చెప్పా. నీరజ స్ట్రాంగ్‌‌ క్యారెక్టర్స్‌‌తో వచ్చారు.  రాశీ,  శ్రీనిధి క్యారెక్టర్స్‌‌ ఎంత బలంగా ఉంటాయో వాళ్లకి మించిన స్ట్రాంగ్ క్యారెక్టర్ హీరోది. సినిమా మొదలైన 23వ నిమిషం తర్వాత నా క్యారెక్టర్ ఒక వైల్డ్ టర్న్ తీసుకుంటుంది. 
    
నాపై నాకే ఎక్స్‌‌పెక్టేషన్స్‌‌ ఎక్కువ ఉంటాయి. మునుపటి కంటే బెటర్‌‌‌‌ కంటెంట్‌‌ ఇవ్వాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ఒక్కోసారి వర్కవుట్ అవుతుంది.. మరోసారి కాకపోవచ్చు.  కానీ నేను ఒక సీన్‌‌కు వర్క్ చేసేటప్పుడు ఎంత ఎక్సైటింగ్‌‌గా ఫీల్ అయ్యానో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు కూడా అదే ఫీలవ్వాలనేది నా ఇంటెన్షన్‌‌.  
    
ఒకప్పుడు నాకోసం ఎవరు కథలు రాయలేదు. అందుకే ఓవైపు సినిమాల్లో నటిస్తూనే,  ఎలా తీయాలో కూడా నేర్చుకోవాల్సి వచ్చింది.  నిర్మాతలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మేకింగ్‌‌లో ఇన్వాల్వ్‌‌ అవుతుంటాను.  సినిమా హిట్ అయితే అన్ని డిపార్ట్‌‌మెంట్స్‌‌ను మెచ్చుకుంటారు. అదే సినిమా పోతే సిద్ధు ఇన్వాల్వ్ అయ్యాడు కనుకే పోయింది అంటారు.  హిట్ అయితే క్రెడిట్ అందరికీ, పోతే నా ఒక్కడికే బ్లేమ్.  దానికి తెగించే ఇక్కడ ఉన్నా.  
    
‘జాక్’ రిజల్ట్‌ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ గారు ఫోన్ చేసి ‘‘టిల్లు’తో ఆల్ టైం హై చూశావు, ‘జాక్’తో లో చూశావు.. ఇక నువ్వు ఏం చేసినా ఆ రెండిటి మధ్య చూస్తావు' అన్నారు.  ఆ మాటలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే నమ్మకాన్ని ఇచ్చాయి. ఇక భవిష్యత్తులో డైరెక్షన్‌ చేయాలనే ఆలోచన ఉంది. కొన్ని స్టోరీ ఐడియాస్‌ కూడా ఉన్నాయి.  దానికి సరైన సమయం కుదరాలి.

నటుడిగా నా సీన్‌‌ పూర్తి చేసి కార్వాన్‌‌లోకి వెళ్లిపోవాలని నాకు కూడా ఉంటుంది. అలా నేను ఇన్వాల్వ్ అవ్వకుండా సినిమా చేయడం అనేది నా కల. (నవ్వుతూ) కానీ నాకు ఆ లగ్జరీ లేదు. మేకింగ్‌‌లో ఎక్కువ వుండటంతో ఆ ప్రాసెస్‌‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నా. థియేటర్‌‌‌‌లో ఆడియెన్స్‌‌ ఎక్స్‌‌పీరియన్స్‌‌ను మాత్రం ఎంజాయ్ చేస్తున్నా. నేను అనుకున్న రియాక్షన్స్‌‌ వాళ్లు కూడా ఫీలవుతున్నారా లేదా అన్నది కిక్ ఇస్తోంది.