గంగా సప్తమి ( మే 3) : గంగమ్మ తల్లి భూమిపైకి వచ్చినరోజు.. ఆరోజు ఏం చేయాలంటే..

గంగా సప్తమి ( మే 3) :  గంగమ్మ తల్లి భూమిపైకి వచ్చినరోజు.. ఆరోజు ఏం చేయాలంటే..

పురాణాల ప్రకారం వైశాఖ శుద్ద సప్తమి రోజున గంగాదేవి  భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. హిందూ మతంలో ఆ రోజుకి (మే 3)   ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో గంగా సప్తమి రోజున తీసుకోవలసిన కొన్ని నియమ నిబంధనలు పేర్కొన్నాయి. ఈ పరిహారాలు చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోయి ఇంటికి ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. గంగా సప్తమికి చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం.

 గంగా సప్తమి రోజు గంగాదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున గంగాదేవిని పూజిస్తారు. గంగా సప్తమి రోజున గంగాదేవి పునర్జన్మ పొందిందని మత విశ్వాసం. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తిథి రోజుని గంగా సప్తమిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం (2025)లో గంగా సప్తమి పండుగను 3  మే 2025 శనివారం జరుపుకోనున్నారు.

జ్యోతిష్య నిపుణులు ప్రకారం  ఈ ఏడాది (2025) గంగా సప్తమి ( మే  3)  నాడు త్రిపుష్కర, రవి మరియు శివవాస యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలలో గంగా స్నానం, దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ తిథి నాడు పునర్వసు, పుష్య నక్షత్రాల సంయోగం కూడా ఏర్పడుతుంది. రెండు నక్షత్రాలలో గంగా పూజ, స్నానం చేయడం వల్ల ప్రత్యేక ఫలితాలు ఉంటాయని చెప్పబడింది.

  • సప్తమి తిథి ప్రారంభం శనివారం, మే 3, 2025 : మే 3న ఉదయం 7:51
  • సప్తమి తిథి ముగింపు: మే 4న ఉదయం 7:18
  • గంగా సప్తమి నాడు గంగా స్నానం చేయడానికి శుభ ముహూర్తం ఉదయం 10:58 గంటల నుండి మధ్యాహ్నం 1:38 గంటల వరకు ఉంది. ఈ ముహూర్తంలో దానం చేయడం వల్ల దేవతలు, పితృదేవతలు సంతోషిస్తారు.

గంగా సప్తమి నాడు ఏర్పడుతున్న శుభ ముహూర్తాలు

  • బ్రహ్మ ముహూర్తం  : 04:13 AM నుండి 04:56 AM వరకు
  • అభిజిత్ ముహూర్తం :  11:52 AM నుండి 12:45 PM వరకు
  • విజయ ముహూర్తం :  02:31 PM నుండి 03:25 PM వరకు
  • అమృత కాలం :  10:13 AM నుండి 11:47 AM వరకు
  • త్రిపుష్కర యోగం :  07:51 AM నుండి 12:34 PM వరకు
  • రవి యోగం :  05:39 AM నుండి 12:34 PM వరకు

వైశాఖ శుద్ద సప్తమి రోజున గంగా మాత స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన రోజని పండితులు చెబుతున్నారు. శివుడు తన జడ జుట్టులో గంగా మాతను  భూమిపైకి వదిలాడని పురాణాలు చెబుతున్నాయి.  ఆ  రోజున ( మే 3)  ప్రయాగ్‌రాజ్..హరిద్వార్.. వారణాసి .. రిషికేశ్ వంటి పుణ్యక్షేత్రాలలో గంగానదిలో స్నానం చేయడం వలన పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.   అక్కడకు వెళ్లక పోయినా స్నానం చేసేటప్పుడు  బకెట్​ లో గంగానది నీరును కలుపుకొని స్నానం కూడా చేయవచ్చు.  స్నానం చేసిన తర్వాత నువ్వులు, బట్టలు, ఆహారం, నీరు లేదా దక్షిణ దానం చేయండి.  ఆ రోజున ( మే3 )  గంగా నది ఒడ్డున  దీపం వెలిగించి   గంగమ్మ  తల్లికి హరతి ఇవ్వాలి.  సాయంత్రం సమయంలో   దీపాలను వెలిగించి గంగానదిలో వదలాలి.  

గంగా సప్తమి ప్రత్యేక పూజా విధానం

ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి.
గంగామాతను ధ్యానిస్తూ  ..ఓం నమః శివాయ..  గంగే నమః" అనే మంత్రాన్ని జపించండి.
ఇంట్లో లేదా ఆలయంలో గంగా జలంతో పూజ చేసి పండ్లు, పూలు, దీపం, నైవేద్యాలు సమర్పించండి.
ఉపవాసం ఉండి, రోజంతా గంగా తల్లి నామాన్ని స్మరించుకోండి

►ALSO READ | జ్యోతిష్యం : మీకు ఉద్యోగం, డబ్బు ఇచ్చేది శని దేవుడే.. మీ రాశిలో ఎక్కడ ఉన్నాడో చూసుకోండి..!