
పరమేశ్వరుడికి శ్రావణమాసం అంటే ఎంతో ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రావణమాసంలో శివుడిని పూజిస్తే చాలు.. కోరిన కోరికలు తీరుతాయి. అదే సోమవారం అయితే విశేష ఫలితాలు ఉంటాయి. మరి శ్రావణ మాసం రెండో సోమవారం రోజు ( ఆగస్టు 4) ఎలా పూజించాలో తెలుసుకుందాం. . .
శ్రావణమాసం కొనసాగుతుంది. ఆగస్టు 4 రెండో సోమవారం. శ్రావణ మాసం సోమవారానికి విశేష మహత్యముంది. .శ్రావణ మాసంలో రెండో సోమవారం ఇష్టదైవాన్ని పండ్లతో పూజిస్తే మంచి పుణ్యఫలం దక్కుతుంది.శ్రావణ సోమవారం నాడు శివుడిని ఆరాధించడం వల్ల కోరకున్న ఫలితాన్ని పొందుతారని నమ్మకం ఉంది. అలాగే సుఖసంతోషాలు, సౌభాగ్యాలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు..
సోమవారం శివుడిని పిల్లలు.. పెద్దలు .. మహిళలు అందరూ పూజిస్తారు. శివునికి విద్యార్థులు అభిషేకం చేస్తే జ్ఞానం లభిస్తుంది.అలాగే ఆ రోజున ( ఆగస్టు 4) ఉపవాసం ఉండడం వల్ల పెళ్లికాని అమ్మాయిలు కోరుకున్న వరుడు లభిస్తారని పండితులు చెబుతున్నారు. నిరుద్యోగులు శ్రావణ సోమవారం నాడు ఉపవాసం ఉండడం వల్ల ఉద్యోగాలు లభిస్తాయని చెబుతారు. మంచి కుటుంబం, ఉద్యోగ, వ్యాపార వర్గాలకు చెందిన వారికి ధన, ధాన్యాలు లభిస్తాయి.
సోమవారం నాడు పంచాక్షరీ మంత్రం ‘ఓం నమః శివాయ’ జపించండి. మీరు దుఃఖం, రోగాల నుంచి విముక్తి పొందాలనుకుంటే స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి.శివ అష్టకం, శివ తాండవ స్తోత్రం, శివ మహిమ్న స్తోత్రం, శివ చాలీసా, శివ సహస్త్ర నామం, శివ మంత్రాలు, శివ పురాణం మొదలైన వాటిని చదవాలి లేదా వినాలని చెబుతున్నారు పండితులు.