శ్రావణమాసం ప్రసాదాల వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..

శ్రావణమాసం ప్రసాదాల వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..

ఏ నోము నోచుకున్నా.. ఏ వ్రతం చేసినా దాని వెనుక ఆధ్యాత్మికంతో పాటు సైన్సు కూడా ఉందని చెబుతుంటారు.  అలానే ఎన్నో యుగాలనుంచి వస్తున్న శ్రావణమాసం పూజలు.. వ్రతాల వెనుక కూడా సైంటిఫిక్​ రీజన్​ ఉందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.  అసలు శ్రావణమాసానికి.. ఆరోగ్యానికి గల సంబంధం ఏమిటో తెలుసుకుందాం.

 శ్రావణమాసమంటే  మహిళలకు సందడే సందడి . పూజలు, వ్రతాలు, నోములు నోచి  సౌభాగ్యము , ఐశ్వర్యము కలగాలని కోరుకుంటారు . అయితే ఇందులో అంతర్లీనము గా ఆరోగ్య రహస్యము కూడా ఇమిడి ఉందని నిపుణలు చెబుతున్నారు. సాధారణంగా శ్రావణమాసం పూజలలో అమ్మవారికి తొమ్మిది రకాలైన ప్రసాదాలను సమర్పిస్తుంటారు.  వీటిని తినడం ఇమ్యూనిటి పవర్​ పెరిగి వర్షాకాలంలో వచ్చే వ్యాధుల బారి నుండి రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వర్షాకాలము ప్రారంభం లో సాదారణము గా ప్రబలే పలు రకాల వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన రోగనిరోధక శక్తి ఈ వ్రతాల ద్వారా లభిస్తుంచి . వరలక్ష్మీ పూజలో తొమ్మిది రకాల పిండివంటలు , ఈ రుతువులో లభించే పండ్లు , వివిధ పుష్పాలు నివేదించి కుటుంబ సభ్యులంతా ప్రసాదం గా తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులవుతారు

ఇంకా కుటుంబ సభ్యులలో సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది . మహిళలు పేరంటం పేరుతో ఇరుగుపొరుగు వారిని ఆహ్వానించి పరస్పరము వెళ్ళి వాయినాలను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా స్నేహభావము పెరుగుతుంది .

తొమ్మిది రకాల పిండివంటలు

  • 1. పూర్ణం బూరెలు : సెనగపప్పుతో తయారు చేసిన ఈ బూరెలు తినడం ద్వారా ప్రోటీన్లు సమృద్దిగా లభిస్తాయి
    .
  • 2. పులగం : బియ్యం , పెసరపప్పులను కలిపి తయారు చేస్తారు . గ్లాసుడు బియ్యంలో అరగ్లాసు పెసరపప్పు , తగినంత పంచదార , జీలకర్ర వేస్తారు .. ఇది భుజించడం ద్వారా మేధస్సు వికసిస్తుంది .
  • 3. గారెలు : మినపపప్పు , కొద్దిగా సెనగపప్పు వేసి తయారు చేస్తారు . గారెలంటే అందరికీ ఇస్టము . ఇందులొ ఎన్నో ప్రోటీన్లు ఉన్నాయి .
  • 4. పరమాన్నము : పాలను మరిగిస్తూ దానిలో నెయ్యి కలిపిన బియ్యాన్ని, పంచదార .. వేయడం ద్వారా పరమాన్నము గా తయారవుతుంది . దీన్ని తినడం వల్ల కాల్షియం లభిస్తుంది .
  • 5. చక్కెర పొంగలి : బియ్యము , పాలు , నెయ్యి . పెసరపప్పు , జీడిపప్పు , కిస్ మిస్ , మిరియాలు వేసి తయారవుతుంది గాన మెదడు , ఇతర అవయవాలు చురుగా పనిచేసి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి
  • 6. పులిహోరా : బియ్యము , పసువు , జీడిపప్పు , వేరుసెనగ పప్పు , ఇంగువ వేసి తయారవుతుంది . దీనిని తినడం వల్ల శరీరము లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది .
  • 7. చిట్టి బూరెలు : మినపపప్పు ముద్దగా చేసి కొద్దిగ మజ్జిగ కలిపి వేయించి చేస్తారు . ఇవి పిల్లలకు చాలా ఇష్టము . చలువ చేస్తుంది .
  • 8. పెసర బూరెలు : పెసర పప్పుతో తయారు చేసిన ఈ బూరెలు లలో ప్రోటీన్లు లభిస్తాయి.
  • 9. గోధుమ ప్రసాదము : గోధుమ నూక , పంచదార , నెయ్యి , మిశ్రమముతో తయారుచేస్తారు . ఇది బలమైన ఆహారము