
లండన్:యూకేలోని ఇండియన్ సిక్కు రెస్టారెంట్ ఓనర్ కార్లను ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని బెదిరించినట్లు బాధితుడు హర్మన్ సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఏడాది మేలో ఖలిస్తాన్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ టిక్‌టాక్‌లో హర్మన్ సింగ్ వీడియో అప్లోడ్ చేశాడు.
అది కాస్త వైరల్ కావడంతో ఖలిస్తానీ మద్దతుదారులు హర్మన్‌ను టార్గెట్ చేశారు. ఇప్పటిదాకా నాలుగు సార్లు దాడి జరిగినట్లు బాధితుడు చెప్పాడు. వీడియో డిలీట్ చేయాలని ఫోన్ చేసి బెదిరించారని వివరించాడు. ఇంటి ముందు పార్క్ చేసిన రెండు కార్లపై రెడ్ పెయింట్ వేసి వార్నింగ్ ఇచ్చారన్నారు. కారు అద్దాలు ధ్వంసం చేశారని, కిటికీలపై కాల్పులు జరిపారని తెలిపాడు.
తన భార్య, కూతురును రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని హర్మన్ సింగ్ వివరించాడు. పోలీసులకు కంప్లైంట్ చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపాడు. గతంలో తన రెస్టారెంట్పైనా దాడి చేశారని వివరించాడు.