వియత్నాం ఓపెన్ లో సిక్కి రెడ్డి జోడీ జోరు

వియత్నాం ఓపెన్ లో సిక్కి రెడ్డి జోడీ జోరు

హో చి మిన్‌‌: ఇండియా డబుల్స్‌‌ స్టార్‌‌ షట్లర్‌‌ సిక్కి రెడ్డి–రోహన్‌‌ కపూర్‌‌ జోడీ.. వియత్నాం ఓపెన్‌‌ సూపర్‌‌–100 బ్యాడ్మింటన్‌‌ టోర్నీలో క్వార్టర్‌‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌లో సిక్కి–రోహన్‌‌ 21–10, 19–21, 21–18తో యెంగ్‌‌ సింగ్‌‌ చో–ఫన్‌‌ కా యాన్‌‌ (హాంకాంగ్‌‌)పై గెలిచారు. విమెన్స్‌‌ సింగిల్స్‌‌ రెండో రౌండ్‌‌లో గద్దె రుత్వికా శివాని 21–15, 18–21, 17–21తో తి తిరంగ్‌‌ వుయ్‌‌ (వియత్నాం) చేతిలో, నీలూరి ప్రేరణ 3–21, 7–21తో అయా ఓహోరి (జపాన్‌‌) చేతిలో, ఐరా శర్మ 18–21, 10–21తో గో జిన్‌‌ వీ (మలేసియా) చేతిలో, రుతుపర్ణ దాస్‌‌ 15–21, 16–21తో తాయ్‌‌ పువోంగ్‌‌ తాయ్‌‌ ట్రాన్‌‌ (వియత్నాం) చేతిలో పరాజయం పాలయ్యారు.