రెండు రోజులు వెనక్కి వెళ్లిన శింబు ’ముత్తు’

రెండు రోజులు వెనక్కి వెళ్లిన శింబు ’ముత్తు’

శింబు హీరోగా తమిళంలో నటించిన ‘వెందు తనిందదు కాడు’ సినిమా సెప్టెంబర్ 15వ తేదీ గురువారం విడుదల కాబోతోంది. తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరిట విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కానీ.. లాస్ట్ మినిట్ లో విడుదల తేదీని వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని శ్రీ స్రవంతి మూవీస్ (Sri Sravanthi Movies) ట్వీట్ ద్వారా తెలియచేసింది. సాంకేతిక సమస్య కారణంగా తెలుగులో సెప్టెంబర్ 17న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది.

తమిళ వెర్షన్ లో మాత్రం ఈ నెల 15 నుంచి తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రదర్శితం కానున్నట్లు తెలిపింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకున్నాయి. శింబుకు జోడిగా సిద్ది ఇద్నాని హీరోయిన్ గా నటించారు.  మన్మథ, వల్లభ వంటి చిత్రాలతో తెలుగులో శింబు మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ కోసం శింబు ఏకంగా ఏకంగా 15 కేజీల బరువు తగ్గాడంట.