ఆర్‌‌సీబీ హెడ్‌‌ కోచ్‌‌గా కటిచ్‌‌

ఆర్‌‌సీబీ హెడ్‌‌ కోచ్‌‌గా కటిచ్‌‌

క్రికెట్‌‌ ఆపరేషన్స్‌‌ డైరెక్టర్‌‌గా హెసన్‌‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌ ఫ్రాంచైజీ రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు (ఆర్‌‌సీబీ) కోచింగ్‌‌ సెటప్‌‌లో భారీ మార్పులు చేసింది. న్యూజిలాండ్‌‌ మాజీ కోచ్‌‌ మైక్‌‌ హెసన్‌‌ను.. క్రికెట్‌‌ ఆపరేషన్స్‌‌ డైరెక్టర్‌‌గా నియమించింది. అలాగే టీమ్‌‌ హెడ్‌‌ కోచ్‌‌ బాధ్యతను ఆసీస్‌‌ మాజీ క్రికెటర్‌‌ సైమన్‌‌ కటిచ్‌‌కు అప్పగించింది. దీంతో గత రెండేళ్లుగా ఆర్‌‌సీబీ మెంటార్‌‌, హెడ్‌‌ కోచ్‌‌గా పని చేసిన కిర్‌‌స్టన్‌‌, బౌలింగ్‌‌ కోచ్‌‌ నెహ్రాకు ఉద్వాసన పలికింది. ‘ఆర్‌‌సీబీకి సంబంధించిన క్రికెట్‌‌ ఆపరేషన్స్‌‌ మొత్తాన్ని హెసన్‌‌ పర్యవేక్షిస్తాడు. పాలసీ, స్ట్రాటజీ, ప్రోగ్రామ్స్‌‌, స్కౌటింగ్‌‌, పెర్ఫామెన్స్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌.. ఇలా అన్ని బాధ్యతలను అతనికే అప్పగిస్తున్నాం. ఆటగాళ్లు, కోచింగ్‌‌ టీమ్‌‌తో డైరెక్ట్‌‌గా కలిసి పని చేస్తాడు. టీమ్‌‌లో హై పెర్ఫామెన్స్‌‌ కల్చర్‌‌ను తీసుకురావడానికి కటిచ్‌‌ పని చేస్తాడు’ అని ఆర్‌‌సీబీ చైర్మన్‌‌ సంజీవ్‌‌ చురివాలా పేర్కొన్నారు.