
గదర్ 2 సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టనుంది నటి సిమ్రత్ కౌర్(Simrat Kaur). ప్రేమతో మీ కార్తిక్ సినిమాతో 2017లో ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమైంది. చాలా గ్యాప్ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఈ బాలీవుడ్ బడా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, మొదటి సినిమా చేసిన తర్వాత తనకు నాలుగేళ్ల పాటు చాన్స్‌లు రాలేదని తెలిపింది.
ఈ కారణంతో కొన్నాళ్లు ఎంతో కుమిలిపోయానని డిప్రెషన్లోకి వెళ్లానని తెలిపింది. తనకు సినిమాలు లేకపోవడానికి గల కారణం తెలియక రోజంతా ఏడుస్తూ కూర్చునేదాన్నని చెప్పింది. ఆ టైంలో తన తన ఫ్యామిలీ అండగా నిలిచిందని పేర్కొంది. వారి సపోర్ట్ వల్లే తిరిగి బాలీవుడ్లో చాన్స్ అందుకున్నానని వివరించింది.
గదర్2లో అమిషా పటేల్, సన్నీడియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. సిమ్రత్ మరో కీ రోల్లో కనిపించనుంది.