సింధూ ప్రాంతం భారత్ లో భాగమే.. సరిహద్దులు ఏ క్షణాన్నైనా మారవచ్చు: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

సింధూ ప్రాంతం భారత్ లో భాగమే.. సరిహద్దులు  ఏ క్షణాన్నైనా మారవచ్చు: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

పాకిస్తాన్ లోని సింధూ భూభాగంపై  రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సింధూ భూభాగం పాకిస్తాన్ లో ఉండొచ్చుకానీ అది ఎప్పటికీ భారత్ లో భాగమే అన్నారు. సరిహద్దులు మారవచ్చు... ఆ ప్రాంతం భారత్ కు తిరిగి రావొచ్చని అన్నారు. 1947లో దేశ విభజన తర్వాత సింధు నదికి సమీపంలో ఉన్న సింధ్ ప్రావిన్స్ ఆ ప్రాంతంలో నివసించిన సింధీ ప్రజలు భారతదేశానికి వచ్చినా ఆ ప్రాంతం పాకిస్తాన్‌లోనే ఉండిపోయింది.. అక్కడినుంచి వచ్చిన సింధ్ హిందువులు ఈ విషయాన్ని  అంగీకరించడం లేదన్నారు రాజ్ నాథ్ సింగ్. 

ఎల్ కే అద్వానీ లాంటి  సింధ్ హిందువులు ముఖ్యంగా అతని తరానికి చెందినవారు..భారత్ నుంచి సింధు భూభాగం విడిపోయవడాన్ని ఇప్పటికీ అంగీకరించలేదన్నారు. ఇదే విషయాన్ని  లాల్ కృష్ణ అద్వానీ తన పుస్తకంలో రాశారని అన్నారు. 

సింధు ప్రాంతంలోనేకాదు.. భారతదేశం అంతటా, హిందువులు సింధు నదిని పవిత్రంగా భావిస్తారు.. సింధ్‌లోని చాలా మంది ముస్లింలు కూడా సింధు నది నీరు మక్కాలోని ఆబ్-ఎ-జంజామ్ కంటే తక్కువ పవిత్రమైనది విశ్వసిస్తారు.. అని అద్వానీ జీ  కోట్ అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. 

తన సోషల్ మీడియాలో ప్లాట్ ఫాం Xలో ఓ పోస్ట్ షేర్ చేసిన రాజ్ నాథ్ సింగ్.. సింధు ప్రస్తావన తెస్తూ.. నేడు సింధ్ భూమి భారతదేశంలో భాగం కాకపోవచ్చు..కానీ నాగరికత ప్రకారం..సింధ్ ఎల్లప్పుడూ భారత్ లో భాగంగానే ఉంటుంది. భూమి విషయానికొస్తే సరిహద్దులు మారవచ్చు.. ఎవరికి తెలుసు..రేపు సింధ్ మళ్ళీ భారతదేశానికి తిరిగి రావచ్చు.. సింధు నదిని పవిత్రంగా భావించే మన సింధ్ ప్రజలు ఎల్లప్పుడూ మనవారే. వారు ఎక్కడ ఉన్నా వారు ఎల్లప్పుడూ మనవారే  అని రక్షణ మంత్రి అన్నారు.

గతంలో కూడా రాజ్ నాథ్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సెప్టెంబర్ 22 మొరాకోలో భారతీయ ప్రవాసులతో మాట్లాడుతూ..పీఓకేలో ప్రజలు ఆక్రమదారులనుంచి విముక్తి కోరుతున్నారు..ఎటువంటి చర్యలు లేకుండానే భారత్ పీఓకేను తిరిగి పొందుతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.