
బర్మింగ్‌హామ్ : ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో చుక్కెదురైంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సింధు 19–21, 11–21తో టాప్‌సీడ్, వరల్డ్ నంబర్‌వన్ అన్ సీ యంగ్ (కొరియా) చేతిలో ఓడింది. 42 నిమిషాల మ్యాచ్ తొలి గేమ్‌లో గట్టి పోటీ ఇచ్చిన తెలుగమ్మాయి రెండో గేమ్‌లో తేలిపోయింది. కొరియన్ కొట్టిన పవర్‌ఫుల్ స్మాష్‌ల ముందు నిలవలేకపోయింది. మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ 24–22, 11–21, 21–14తో నాలుగోసీడ్ అండెర్స్ అంటోన్‌సెన్ (డెన్మార్క్)పై చెమటోడ్చి నెగ్గి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. విమెన్స్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప 21–11, 11–21, 11–21తో జాంగ్ షు జియాన్–జెంగ్ యు (చైనా) చేతిలో ఓడారు.