ఫస్ట్ రౌండ్‎లోనే ఓటమి.. ఇండియా ఓపెన్‌‌‌‌‌‌‌‌ టోర్నీ నుంచి సింధు ఔట్‌‌‌‌‌‌‌‌

ఫస్ట్ రౌండ్‎లోనే ఓటమి.. ఇండియా ఓపెన్‌‌‌‌‌‌‌‌ టోర్నీ నుంచి సింధు ఔట్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ పీవీ సింధు ఇండియా ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–750 టోర్నీలో నిరాశపర్చింది. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లోనే సింధు 22–20, 12–21, 15–21తో తియు లిన్హ్‌‌‌‌‌‌‌‌ ఎగుయెన్‌‌‌‌‌‌‌‌ (వియత్నాం) చేతిలో ఓడింది. 68 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తొలి గేమ్‌‌‌‌‌‌‌‌ నెగ్గి ఫామ్‌‌‌‌‌‌‌‌ చూపెట్టిన తెలుగమ్మాయి.. తర్వాతి రెండు గేమ్‌‌‌‌‌‌‌‌ల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. ర్యాలీలు ఆడటంలో, నెట్‌‌‌‌‌‌‌‌ వద్ద డ్రాప్స్‌‌‌‌‌‌‌‌ను తీయడంలో ఇబ్బంది పడింది.

 ఫలితంగా చివరి రెండు గేమ్‌‌‌‌‌‌‌‌ల్లో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో మాళవిక బన్సోద్‌‌‌‌‌‌‌‌ 21–18, 21–19తో పాయ్‌‌‌‌‌‌‌‌ యు పో (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ)పై గెలవగా, తన్వీ శర్మ 20–22, 21–18, 13–21తో వాంగ్‌‌‌‌‌‌‌‌ జి యి (చైనా) చేతిలో ఓడింది. మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో హెచ్‌‌‌‌‌‌‌‌.ఎస్‌‌‌‌‌‌‌‌. ప్రణయ్‌‌‌‌‌‌‌‌ 22–20, 21–18తో లీ చుక్‌‌‌‌‌‌‌‌ యి (హాంకాంగ్‌‌‌‌‌‌‌‌)పై, కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ 15–21, 21–6, 21–19తో తరుణ్‌‌‌‌‌‌‌‌ మానేపల్లిపై గెలిచారు. 

విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో గాయత్రి రావత్‌‌‌‌‌‌‌‌–మానస రావత్‌‌‌‌‌‌‌‌ 5–21, 8–21తో బీక్‌‌‌‌‌‌‌‌ హా నా–లీ సో హి (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ) చేతిలో, రుతుపర్ణా–శ్వేతపర్ణా 8–21, 18–21తో ననాకో హరా–రికో కియోసి (జపాన్‌‌‌‌‌‌‌‌) చేతిలో, కవిప్రియా సెల్వం–సిమ్రాన్‌‌‌‌‌‌‌‌ సింగి 18–21, 6–21తో పియర్లీ టాన్‌‌‌‌‌‌‌‌–తిన్హా మురళీధరన్‌‌‌‌‌‌‌‌ (థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌) చేతిలో, అశ్విని భట్‌‌‌‌‌‌‌‌–శిఖా గౌతమ్‌‌‌‌‌‌‌‌ 18–21, 16–21తో మార్గెట్‌‌‌‌‌‌‌‌ లాంబోర్ట్‌‌‌‌‌‌‌‌–కామిల్లా పోగ్నెట్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌) చేతిలో కంగుతిన్నారు.

 మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌లో రోహన్‌‌‌‌‌‌‌‌ కపూర్‌‌‌‌‌‌‌‌–రుత్వికా శివాని 19–21, 14–21తో మార్విన్‌‌‌‌‌‌‌‌ సిడెల్‌‌‌‌‌‌‌‌–తుక్‌‌‌‌‌‌‌‌ పోహంగ్‌‌‌‌‌‌‌‌ ఎన్గుయెన్‌‌‌‌‌‌‌‌ (జర్మనీ) చేతిలో, అశిత్‌‌‌‌‌‌‌‌ సూర్య–అమృత ప్రథమేశ్‌‌‌‌‌‌‌‌ 15–21, 7–21తో యిచి షిమోగామి–సయకా హోబ్రా (జపాన్‌‌‌‌‌‌‌‌) చేతిలో, ధ్రువ్‌‌‌‌‌‌‌‌ కపిల–తనీషా క్రాస్టో 15–21, 14–21తో పకాపోన్‌‌‌‌‌‌‌‌–సప్సిరి (థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌) చేతిలో పరాజయం చవిచూశారు.