సింగరేణి బలం కార్మికులే!..వారి భద్రత, సంక్షేమమే లక్ష్యం: సీఎండీ కృష్ణ భాస్కర్

సింగరేణి బలం కార్మికులే!..వారి భద్రత, సంక్షేమమే లక్ష్యం: సీఎండీ కృష్ణ భాస్కర్

హైదరాబాద్, వెలుగు:  సింగరేణి సంస్థ బలం కేవలం ఉత్పత్తిలో కాదని.. కార్మికుల శ్రమ, క్రమశిక్షణ, నమ్మకంలో ఉందని సంస్థ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి సీఎండీ డి.కృష్ణ భాస్కర్ అన్నారు. 137 ఏండ్ల సంస్థ దృఢంగా నిలబడటం వెనుక కార్మికుల కృషి ఉందని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్‌‌‌‌‌‌‌‌లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవం  నిర్వహించారు. దానికి కృష్ణ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. 

కార్మికుల భద్రత, సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణే లక్ష్యమని.. ఈ ఏడాది ప్రతికూల వాతావరణం, సాంకేతిక సవాళ్లు ఉన్నప్పటికీ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగామని గుర్తుచేశారు. భవిష్యత్తులో కీలక ఖనిజాలు, పునరుత్పాదక శక్తి రంగాల్లో అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.