రైతు బజార్లలో ఫుడ్ సేఫ్టీ శిబిరాలు

రైతు బజార్లలో ఫుడ్ సేఫ్టీ శిబిరాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలతో నగరంలోని 14 రైతు బజార్లలో  మంగళవారం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్​ఎస్​ఏఐ) నమోదు, లైసెన్సింగ్ శిబిరాలు నిర్వహించారు. కూరగాయల వ్యాపారులకు ఎఫ్ఎస్​ఎస్​ఏఐ రిజిస్ట్రేషన్, లైసెన్సులు జారీ చేశారు. 

ఆహార భద్రతపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. కుషాయిగూడ, ఉప్పల్, సరూర్ నగర్, ఎన్టీఆర్ నగర్, వనస్థలిపురం, మాదన్నపేట, మీర్ ఆలం మండి, ఓవైసీ, మోండా, మెట్టుగూడ, ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్, లింగంపల్లి, జేఎన్‌‌‌‌టీయూ మార్కెట్లు, రైతు బజార్లలో శిబిరాలు నిర్వహించగా 926 మంది వ్యాపారులు రిజిస్ట్రేషన్, లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.