జైపూర్(భీమారం), వెలుగు: మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లి సమీపంలోని మాంతమ్మ గుడి, పోతనపల్లి ఫారెస్ట్ లో పెద్దపులి సంచరిస్తున్నట్లు మంచిర్యాల ఎఫ్ఆర్వో రత్నాకర్ రావు తెలిపారు. పెద్దపులి పాదముద్రలను గుర్తించామని, చేలకు వెళ్లే రైతులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు. రైతులు, పశువుల కాపర్లు ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు. పులి కదిలికపై నిఘా పెంచామని, ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.
