- పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు పట్టిన గబ్బిలాలు కేటీఆర్, హరీశ్ రావు అని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ముందుగా కవిత చేస్తున్న ఆరోపణలకు ఆ ఇద్దరు సమాధానం ఇస్తే వారిని తెలంగాణ జనం నమ్ముతారని, సొంత కుటుంబ సభ్యురాలు చేసిన ఆరోపణలకు జవాబు ఇవ్వలేని నేతలకు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒక యజ్ఞంలా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ పెరిగితే చూస్తూ తట్టుకోలేని బీఆర్ఎస్ నేతలు రేవంత్ పై, ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
