ఘట్కేసర్, వెలుగు: భార్య విడాకుల కోసం లీగల్ నోటీసులు పంపిందని భర్త సూసైడ్ చేసుకున్నాడు. ఘట్కేసర్ పరిధిలోని ఎదులాబాద్కుచెందిన గట్టుపల్లి వెంకటేశ్ (40) తో కీసరకు చెందిన మౌనిక అలియాన్ విజయలక్ష్మికి 2019లో పెండ్లి జరిగింది. వీరికి సంతానం కాకపోడంతో ఫ్యామిలీలో గొడవలు జరిగాయి. భర్త దాపత్య జీవితానికి పనికిరాడని విడాకులు కావాలని గతంలో పెద్ద మనుషుల సమక్షంలో భార్య పంచాదీ పెట్టింది.
భార్యకు విడాకులు ఇవ్వాలని చెప్పిన వెంకటేశ్ ఒప్పుకోలేదు. ఈ క్రమంలో భార్య విడాకుల కోసం లీగల్ నోటీసులు పంపించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటేశ్ మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని చనిపోయినట్లు సీఐ బాలస్వామి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
