నచ్చిన కంపెనీలకు టెండర్లు ఇస్తున్నారు

నచ్చిన కంపెనీలకు టెండర్లు ఇస్తున్నారు

సింగరేణి  టెండర్ల  విషయంలో  రాష్ట్ర ప్రభుత్వం  పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ  ఫైర్ అయ్యారు  కాంగ్రెస్ నేత  కోమటిరెడ్డి  రాజగోపాలరెడ్డి. తమకు నచ్చిన  కంపెనీలకు  టెండర్లు ఇస్తున్నారన్నారు. సింగరేణి  ప్రైవేటు పరం కాకుండా  కాపాడుకోవాలి  అంటూనే..  నష్టం  వచ్చేలా  టెండర్లు  ఇస్తున్నారని ఆరోపించారు. 20వేల  కోట్ల నష్టానికి  టెండర్లు అప్పగించారన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి నన్ను కాంట్రాక్టర్ అనడం బాధాకరం అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి జగదీశ్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలోనే తమకు ఇష్టం వచ్చిన కంపెనీలకు టెండర్లు ఇచ్చారని ఫైర్ అయ్యారు. సింగరేణి టెండర్లు పారదర్శకంగా వేశామన్నారు. రాష్ట్రంలో TRS ప్రభుత్వం ఉన్నంతకాలం సింగరేణిని ప్రైవేటు పరం కానివ్వమన్నారు. సింగరేణి ప్రజలకు హామీ ఇస్తున్నామన్నారు జగదీశ్ రెడ్డి.